News April 30, 2024

మాట్లాడిన 5 నిమిషాలకే రాఘవ్‌‌తో ప్రేమలో పడ్డా: పరిణీతి

image

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల వివాహం గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. తన లవ్ స్టోరీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడారు. ‘తొలిసారి రాఘవ్‌ను లండన్‌లో కలిశాను. ఆయనతో మాట్లాడిన ఐదు నిమిషాలకే.. నాకు కాబోయే భర్త అతడే అని నా మనసుకు అనిపించింది. అప్పటికి తన గురించి నాకేం తెలియదు. వయసెంత? పెళ్లైందా? ఏం చేస్తుంటారు? ఇలాంటివేమీ ఆలోచించలేదు’ అని చెప్పారు.

Similar News

News December 29, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT/PET ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈవెంట్లకు ఎంపికైన వారు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే గడువు ఇవాళ్టితో ముగిసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఆఫీసు(ఉ.10-సా.6) సమయంలో నంబర్లను సంప్రదించండి.
ALL THE BEST

News December 29, 2024

రేపు రాత్రి PSLV-C60 ప్ర‌యోగం

image

అంత‌రిక్షంలో నిర్దిష్ట ప్ర‌దేశంలో 2 స్పేస్‌క్రాఫ్ట్‌లను కలపడం – స్పేస్ డాకింగ్ ప్ర‌యోగాల‌కు ఉద్దేశించిన PSLV-C60ని ఇస్రో సోమ‌వారం ప్ర‌యోగించ‌నుంది. SpaDex మిష‌న్‌లో SDX01 (ఛేజ‌ర్‌), SDX02 (టార్గెట్‌) ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోకి పంపుతారు. ఆదివారం రాత్రి కౌంట్‌డౌన్ ప్రారంభ‌మ‌య్యే ఈ ప్ర‌యోగాన్ని త‌రువాతి రోజు రాత్రి 8.58 గంట‌ల‌కు నింగిలోకి పంపనున్నారు. స్పేస్ డాకింగ్ ప్ర‌యోగం ఇస్రోకు కీల‌కం కానుంది.

News December 29, 2024

UGC నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

image

UGC-నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని పొందవచ్చు. 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌ను అభ్యర్థులు చెక్ చేసుకోవాలని, సరిగ్గా లేకుంటే మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.