News February 11, 2026

ESIC హాస్పిటల్ భిలాయ్‌లో ఉద్యోగాలు

image

<>ఛత్తీస్‌గఢ్‌<<>>, భిలాయ్‌లోని ESIC హాస్పిటల్ 21 స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 25న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫుల్‌టైమ్ స్పెషలిస్టుకు నెలకు రూ.1,37,837, పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.60,000, సీనియర్ రెసిడెంట్‌కు రూ.1,37,837 చెల్లిస్తారు. సైట్: https://esic.gov.in

Similar News

News February 15, 2026

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు

image

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే|
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః’||
శివుడు, విష్ణువు వేర్వేరు కాదు. ఒకే పరమాత్మ 2 రూపాలు. విష్ణువు జలతత్వమైతే, శివుడు అగ్నితత్వం. వీటి కలయికే ఈ సృష్టి. శివుని హృదయం విష్ణువు. శివుడు విష్ణువు హృదయం అని పురాణాల వాక్కు. సృష్టిని కాపాడటానికి విష్ణువుగా, లయం చేయడానికి శివుడిగా ఆ పరబ్రహ్మమే అవతరించింది. అందుకే వీరిద్దరినీ ‘హరిహరులు’గా పూజిస్తాం.

News February 15, 2026

మాడిన వేప చెట్లు పచ్చగా మళ్లీ మారతాయా?

image

‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ ఫంగస్ వ్యాధి వేప చెట్టుకు మాత్రమే సోకుతుంది. ఇది ప్రధానంగా వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభంలో వ్యాప్తి చెందుతుంది. అందుకే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా వేప చెట్లు పత్రహరితం కోల్పోయి, పూర్తిగా ఎండిపోతాయి. మళ్లీ ఈ చెట్లన్నీ మార్చి నెల నాటికి యథావిథిగా పచ్చగా మారతాయి. గతంలో ఉత్తర భారతదేశంలో కనిపించిన ఈ వ్యాధి, ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని వేప చెట్లలో కూడా కనిపిస్తోంది.

News February 15, 2026

UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌ 8 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు రేపటి నుంచి మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(అకౌంట్స్, పర్చేజ్ &స్టోర్స్, ఫిజిక్స్), డిప్లొమా, ITI, ఇంటర్, టెన్త్, ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 13వరకు పంపాలి. వెబ్‌సైట్: https://csr.res.in/