News February 11, 2026
వరంగల్: ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఈ పరీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున జిల్లా వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
Similar News
News February 15, 2026
వరంగల్: అభివృద్ధి కమిటీ సమావేశాలేవి?

వరంగల్‌లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశాలు సుమారు పదేళ్లుగా నిర్వహించడం లేదు. కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్, ప్రజాప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సీకేఎం జీఎంహెచ్, ఎంజీఎం వంటి సర్కారు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో రోగులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. గతంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించే సమస్యలను వెంటనే పరిష్కరించేవారు.
News February 15, 2026
WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.
News February 13, 2026
నర్సంపేటలో బీజేపీ బోణీ

నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూలూరి రోజా రాణి విజయం సాధించారు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొదటి సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జూలూరి రోజా రాణి తొలి ప్రయత్నంలోనే గెలుపొందారు.


