News April 30, 2024
మనకంటే నిఖార్సైన హిందువులు ఎవరైనా ఉన్నారా?: CM

BJP మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతో కేంద్రం 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. మనం హిందువులం కాదా? బతుకమ్మ ఆడట్లేదా? దసరా, దీపావళి జరుపుకోవట్లేదా? మనకంటే నిఖార్సైన హిందువులు ఎవరైనా ఉన్నారా? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి’ అని అన్నారు.
Similar News
News April 16, 2026
భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
News April 16, 2026
మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.
News April 16, 2026
భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్‌తో పదిలం!

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్‌తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.


