News April 30, 2024
పుష్ప-2 నుంచి అల్లు అర్జున్ పోస్టర్ విడుదల

సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప-2 నుంచి ‘పుష్ప పుష్ప’ సాంగ్ రేపు సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఆ పాటలో అల్లు అర్జున్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో తన ట్రేడ్ మార్క్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఓ భుజం పైకెత్తి, సిగరెట్ తాగుతూ ఉన్న ఐకాన్ స్టార్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో పాట రిలీజవుతుంది.
Similar News
News January 29, 2026
TODAY HEADLINES

* విమాన ప్రమాదంలో MH డిప్యూటీ CM అజిత్ పవార్ దుర్మరణం
* APలో 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు
* AP గ్రూప్-2 ఫలితాలు విడుదల
* 2.0లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ: జగన్
* TG: మున్సి’పోల్స్’.. నేటి నుంచి మొదలైన నామినేషన్లు
* రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
* 4వ T20లో NZ చేతిలో 50 పరుగుల తేడాతో భారత్ ఓటమి
News January 29, 2026
పెళ్లికాని వ్యక్తి మహిళలతో రిలేషన్‌లో ఉంటే తప్పేంటి: కేరళ HC

పెళ్లైన మహిళ సమ్మతితో రిలేషన్‌లో ఉండడం చట్టబద్ధమైనప్పుడు, పెళ్లి కాని వ్యక్తి ఇద్దరు/ముగ్గురు మహిళలతో సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటని కేరళ HC ప్రశ్నించింది. దాని కారణంగా కేరళ MLA రాహుల్ మాంకూటతిల్‌కు బెయిల్ తిరస్కరించడం ఎలా సాధ్యమని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ప్రశ్నించారు. MLAకు వ్యతిరేకంగా పలువురు మహిళలు చేస్తున్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జనరల్ వాదనలు విన్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
News January 29, 2026
ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ కీలక సమావేశం

TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న హైదరాబాద్ రానున్నారు. 2న మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది.


