News April 30, 2024
ఏపీలో అందుకే రైల్వేస్టేషన్ల పేర్లు మారలేదు: RRR

టీడీపీ- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులని ఎంపీ, కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. జగన్ ఒక దుష్టుడు అని విమర్శించారు. ఏపీలోని రైల్వే స్టేషన్‌కు జగన్ పేరు, ఫొటో వేసుకోవడం కుదరదు కనుకే ఆయా స్టేషన్ల పేర్లు మారలేదని ఎద్దేవా చేశారు.
Similar News
News March 21, 2026
ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 21, 2026
పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.