News February 11, 2026

PDPL: ‘స్ట్రాంగ్ రూమ్‌కు చేరేవరకు అప్రమత్తంగా ఉండాలి’

image

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ వరకు చేరేవరకు పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని PDPL- DCP రామ్ రెడ్డి సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. GDK-1, 2 టౌన్, మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భద్రత ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటర్లకు సౌకర్యాలు తదితర విషయాలపై సమీక్షించారు.

Similar News

News February 15, 2026

శివ నామాలు అర్థాలు ‘‘కాలభైరవ’’

image

శివుని ఉగ్ర రూపాలలో ‘కాలభైరవుడు’ శక్తివంతమైనది. ‘కాల’ అంటే సమయం అని అర్థం. సమయాన్ని శాసించేవాడు, కాలాన్ని మింగేసేవాడు కాబట్టి ఆయన కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు(క్షేత్ర పాలకుడు). తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం ఈయనకు ఉంటుంది. భక్తుల భయాన్ని పోగొట్టి, శత్రువుల నుంచి రక్షించే దైవం ఈయన. మనలోని అహంకారాన్ని అంతం చేసి మోక్షమార్గాన్ని చూపే దైవంగా ఈయనను ఆరాధిస్తారు.

News February 15, 2026

పెద్దపల్లి: రేపు తెలంగాణ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూలింగ్

image

రైలు నంబర్ 12723 హైదరాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రేపు 3 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నట్లు నేడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రైలును 3 గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల ప్రయాణికులు సమయ పాలన మార్పు గమనించాలని సూచించారు.

News February 15, 2026

నర్సంపేటలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు..!

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో నకిలీ కంపెనీలు సృష్టించి సుమారు రూ.2.50 కోట్లు మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. వేర్వేరు అడ్రస్‌లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. నిందిత మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్ నడుపుతున్నట్లు సమాచారం. ఆమె స్వగ్రామం లక్నేపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.