News April 30, 2024
రాజంపేట పార్లమెంటు బరిలో 18మంది అభ్యర్థులు

రాజంపేట పార్లమెంటు బరిలో MP అభ్యర్థులుగా 18మంది బరిలో ఉన్నారు. NDA కూటమి-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, YCP-మిథున్ రెడ్డి, కాంగ్రెస్-S.భాషీద్, BSP-యుగేంద్ర, అన్న YSR-అక్బర్, M.బాషా, జై భారత్ పార్టీ-రమణయ్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ-సల్మాన్ ఖాన్, ఇండిపెండెంట్లు-వేంకటాద్రి, ఓబయ్యనాయుడు, నాగరాజు, నాగేశ్వర్ రాజు, శ్రీనివాసులు, రెడ్డిశేఖర్, ప్రదీప్, శ్రీనివాసులు, మాడా రాజ, సుబ్బనరసయ్య ఉన్నారు.
Similar News
News March 10, 2026
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి: మంత్రి మండిపల్లి

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
News March 10, 2026
చిత్తూరు: గ్రామపంచాయతీల పునర్వర్గీకరణ

జిల్లాలోని పంచాయతీలను అర్బన్, గ్రేడ్–I, II, IIIగా విభజించారు. జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితులను ప్రమాణాలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 621 గ్రామపంచాయతీలు ఉండగా 4 అర్బన్, 100 గ్రేడ్–I, 140 గ్రేడ్–II, 377 గ్రేడ్–IIIగా గుర్తించారు. గంగవరం, కాణిపాకం, కార్వేటినగరం, వి.కోటలను అర్బన్ గ్రామపంచాయతీలుగా ప్రకటించారు. ఈ పునర్ వర్గీకరణతో గ్రామీణ పరిపాలన మరింత సమర్థవంతంగా మారనుంది.
News March 10, 2026
పుంగనూరులో నేటి నుంచే గంగ జాతర

పుంగునూరులో మంగళ, బుధవారాలలో సుగుటూరు గంగ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. జాతరను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. జాతరలో భాగంగా ఈరోజు రాత్రి జమీందారు ప్యాలస్‌లో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పట్టణంలో ఊరేగించనున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారు.


