News February 11, 2026

Exit polls: రామగుండంలో ఏ పార్టీకి సీట్లంటే..!

image

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. రామగుండం కార్పొరేషన్(60)లో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా ఫలితాలు ఈనెల 13న వెల్లడి కానున్నాయి.

Similar News

News February 18, 2026

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌(HPCL) ఇంజినీర్, Jr. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 25 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(CBT), గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/

News February 18, 2026

అలిపిరిలో పురాతన మండపం తొలగింపు

image

చాలామంది కాలినడకన తిరుమలకు వెళ్తారు. అలిపిరి వద్ద తొలి మెట్టు ఎక్కగానే కుడి వైపున పురాతన పాదాల మండపం ఉండేది. ఇకపై మీకు అది కనిపించదు. దీనిని పూర్తిగా తొలగించారు. పుణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్స్ ట్రస్ట్ నేతృత్వంలో ఆర్కియాలజీ అధికారులు పర్యవేక్షణలో మండలంలోని దూలాలు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి భద్రపరిచారు. తొలగించక ముందు, ఆ తర్వాత ఎలా ఉందో పై ఫొటోలో చూడవచ్చు.

News February 18, 2026

నిర్మల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు

image

2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకం కింద పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. ఆసక్తి గల ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మార్చి 25లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి రూ.28 వేల నుంచి రూ.42 వేల వరకు చెల్లిస్తామన్నారు.