News April 30, 2024
20 జట్లు.. 55 మ్యాచ్‌లు

టీ20 వరల్డ్ కప్-2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. వెస్టిండీస్‌లో 6, అమెరికాలో 3 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమ్ఇండియా మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.
Similar News
News March 13, 2026
వంటగ్యాస్.. దేశ ప్రజలకు కేంద్రం సూచన

దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు ఆందోళన పడి పానిక్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీని పర్యవేక్షించాలంది. టీవీలు పదేపదే పాత విజువల్స్‌ను చూపించవద్దని కోరింది. డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని తెలిపింది.
News March 13, 2026
నెలసరి సెలవులతో మహిళలకే నష్టం కలగొచ్చు: సుప్రీంకోర్టు

నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్‌పై ప్రభావం చూపొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సంస్థలు మహిళల నియామకానికి ప్రాధాన్యం తగ్గించొచ్చని.. ఫలితంగా వర్క్‌ఫోర్స్‌లో వారి వాటా తగ్గొచ్చని తెలిపింది. ఇలాంటి పిటిషన్లు యువతుల్లో తాము కొన్నిసార్లు పురుషులతో సమానంగా పనిచేయలేమనే అభిప్రాయం కలిగిస్తాయని పేర్కొంది. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలించాలని సూచిస్తూ సంబంధిత రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది.
News March 13, 2026
ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


