News February 11, 2026
బెల్లంపల్లి: వాట్సాప్ స్టేటస్‌లో బ్యాలెట్ పేపర్

బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి బస్తీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ముల జయ తనయుడు సురేష్ 32వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశాడు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు. సదురు వ్యక్తిపై, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 12, 2026
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ నరసింహ

మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు 350 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. సూర్యాపేటలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని, గుర్తింపు కార్డున్న వారికే అనుమతినిస్తామన్నారు. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం అమలులో ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 12, 2026
మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లతో నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రౌండ్ ఫలితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని సూచించారు.
News February 12, 2026
ADB: విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా 249.82 ఎకరాలు

ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడికి సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారులు కూడా అవసరమైన అదనపు భూములను సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది.


