News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 7 నుంచి 9 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 4 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

Similar News

News February 22, 2026

పండుగ రోజుల్లో ముహూర్తాలు ఎందుకు ఉండవు?

image

ముహూర్త శాస్త్రం ప్రకారం.. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు శుభకార్యాలకు అనుకూలం. శ్రీరామనవమి, దుర్గాష్టమి, వినాయక చవితి పండుగ తిథులు అశుభ తిథుల కోవలోకి వస్తాయి. లోక కళ్యాణం కోసం దైవం ఆ రోజుల్లో అవతరించినా, సామాన్యుల వ్యక్తిగత కార్యాలకు (వివాహం, గృహప్రవేశం) ఆ తిథి బలం సరిపోదు. అందుకే పండుగ పవిత్రమైనా, శాస్త్రం నిర్దేశించిన తిథి శుద్ధి లేని కారణంగా ముహూర్తాలు నిర్ణయించరు.

News February 22, 2026

పార్వతీపురం: సచివాలయ సిబ్బంది గైర్హాజరుపై ఎస్టీ కమిషన్ సభ్యుల ఆగ్రహం

image

కొమరాడ మండలం విక్రాంపురం గ్రామ సచివాలయ సిబ్బంది గైర్హాజరుపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కొమరాడ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా విక్రాంపురం సచివాలయంకు ఆకస్మిక సందర్శన నిర్వహించారు. ఈ సమయంలో సచివాలయ కార్యదర్శితో పాటు సిబ్బంది విధులకు గైర్హాజరవ్వడం‌తో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మల్లేశ్ తెలిపారు.

News February 22, 2026

కృష్ణా: బుక్స్ పేరుతో ముందస్తు దందా..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల దందాను ముందే మొదలుపెట్టాయి. 9th పరీక్షలు ముగియగానే, టెన్త్‌లోకి వచ్చే విద్యార్థులు వచ్చే ఏడాదికి సంబంధించిన బుక్స్‌ను ఇప్పుడే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే బుక్స్ పేరుతో వేల రూపాయల వసూళ్లకు దిగడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.