News February 11, 2026

సిరిసిల్లలో 77.56% పోలింగ్ నమోదు

image

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 81959 మంది ఓటర్లకు గాను 63566 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 30482 మంది పురుషులు, 33709 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఓటేశారు. దీంతో 77.56% ఓటింగ్ నమోదు అయింది. ఎన్నికలు ముగిసే సమయానికి 39వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల నడుమ ఘర్షణ జరుగగా, మిగత అన్ని వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

Similar News

News February 17, 2026

కాంగ్రెస్ మండల ఇన్‌ఛార్జ్‌గా సీతక్క కుమారుడు..!

image

కాంగ్రెస్ పార్టీ ములుగు మండల ఇన్‌ఛార్జ్‌గా రాష్ట్ర మంత్రి సీతక్క కుమారుడు కుంజ సూర్యరామ్ నియమితుడయ్యారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన ఇక నుంచి ములుగు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తారనే సంకేతం వచ్చింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పార్టీలో ఏర్పడ్డ అంతర్గత సమస్యల దిద్దుబాటుకు మంత్రి సీతక్క వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

News February 17, 2026

రీసర్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: అల్లూరి కలెక్టర్

image

తహశీల్దార్ లాగిన్లో పెండింగ్లో ఉన్న రీసర్వే సమస్యలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిష్కారం కాని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను, మండల రెవెన్యూ అధికారులు సరైన పరిశీలన చేసి పరిష్కారం కోసం ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ లాగిన్‌కి పంపించాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలన్నారు.

News February 17, 2026

మదనపల్లె: నిందితుడి ఇంట్లోనే బాలిక డెడ్‌బాడీ!

image

మదనపల్లెలో చిన్నారి <<19166799>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నిందితుడి ఇంట్లోనే బాలిక మృతదేహం ఉంది. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఇప్పటికీ అప్పజెప్పలేదు. ఇంట్లోకి వెళ్లకుండా బాలిక బంధువులు, స్థానికులు అడ్డుకుంటున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కడప ఎస్పీ విశ్వనాథ్ వచ్చారు. మరికాసేపట్లో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సైతం రానున్నారు.