News February 11, 2026
కాంగ్రెస్ కుట్రలు ప్రజల తీర్పును ప్రభావితం చేయలేవు: హరీశ్ రావు

కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగుల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు సహకరించడం పై మండిపడ్డారు. బీఆర్ఎస్‌పై విశ్వాసంతో ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 16, 2026
వీరు ఉపవాసం చెయ్యకూడదు

ఉపవాసం మంచిదే కొందరికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులు, BP, కొరోనరీ ఆర్టరీ, అరిథ్మియా సమస్యలున్నవారు ఉపవాసం చేస్తే చక్కెర స్థాయిలు, ఎలక్ట్రోలైట్ సమతుల్యత, నీటి శాతం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీటా బ్లాకర్స్, యాంటీ అరిథమిక్స్, బ్లడ్ థిన్నర్స్ మందులు వాడే వారు ఆహారంతో పాటు నిర్దిష్ట సమయంలో మందులను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.
News February 16, 2026
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి AIIMS నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని AIIMS నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (NORCET 10)షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(Hons.)నర్సింగ్, BSc(నర్సింగ్) , డిప్లొమా(GNM)అర్హత గలవారు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్స్) ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.3వేలు, SC, ST, EWSలకు రూ.2400. వెబ్‌సైట్: https://aiimsexams.ac.in
News February 16, 2026
ఆదిలాబాద్ పురపీఠంపై ‘పొత్తు’ పొడుపు!

ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ క్రమంలో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వతంత్రుల మద్దతు కోసం పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విలువల కంటే పీఠమే ముఖ్యమైందని స్థానికులు విమర్శిస్తున్నారు.


