News February 11, 2026
సిరిసిల్ల జిల్లాలో మున్సిపాలిటీల పోలింగ్ శాతం వివరాలు

సిరిసిల్ల మున్సిపాలిటీలో సాయంత్రం ఐదు గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 39 వార్డులలో 81,959 మంది ఓటర్లకు గాను 63,562 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటల వరకు 77.99 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లకు గాను 31,881 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News February 13, 2026
పాడేరు: పీజీఆర్‌ఎస్‌కు 109 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 109 ఫిర్యాదులు, రెవెన్యూ క్లినిక్‌కు 16 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News February 13, 2026
కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్ కరీంనగర్ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి.
News February 13, 2026
అల్లూరి: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

అడ్డతీగల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్సీలో చేరారు. డీఎంహెచ్‌వో సరిత ఆసుపత్రికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం వారి పరిస్థితి బాగుండడంతో అయిదుగురిని డిశ్చార్జ్ చేశారన్నారు. హాస్టల్లో 24 గంటలు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.


