News February 11, 2026
కామారెడ్డి జిల్లాలో పోలింగ్ సరళి ఏవిధంగా ఉందంటే!

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో 92 వార్డుల్లో 1,49,525 మంది ఓటర్లున్నారు. జిల్లాలో పోలింగ్ సరళి ఉదయం మందకోడిగా సాగిన, పోలింగ్ ముగిసే సమయానికి పుంజుకుంది.
ఉదయం 9గం.లకు 6%
ఉదయం 11గం.లకు 26.86%
మధ్యాహ్నం 1గం.లకు 47.13%
సాయంత్రం 3గం.లకు 59.90%
పోలింగ్ పూర్తయ్యేసరికి 69.48%గా నమోదయ్యాయి.
Similar News
News February 20, 2026
KNR: ‘మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావాలి’

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ స్కూల్ ఆవరణలోని జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం మ్యూజియం పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మ్యూజియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
News February 20, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.
News February 20, 2026
నర్సంపేట: పురుగుమందు తాగి విద్యార్థిని మృతి

హాస్టల్‌లో చేరుస్తారన్న భయంతో పురుగుమందు తాగిప విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధి నాగూర్లపల్లికి చెందిన సౌమ్యను తల్లిదండ్రులు హాస్టల్‌కు వెళ్లాలని మందలించడంతో మనస్తాపం చెందింది. వారిని భయపెట్టాలనే ఉద్దేశంతో 20 రోజుల క్రితం పురుగుమందు తాగింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె, పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచింది.


