News February 12, 2026

సంగారెడ్డి: స్ట్రాంగ్ రూమ్ వద్ద అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ

image

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే వరకు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ చౌహాన్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించిన ఆయన, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎస్పీ పారితోష్ పంకజ్, టెక్నికల్ టీంను అభినందించారు. బాక్సుల తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

Similar News

News February 20, 2026

జగిత్యాల: ‘సేవాలాల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం’

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు గిరిజన సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, గిరిజన నాయకులు ఉన్నారు.

News February 20, 2026

విజయవాడ: ఈ పిల్లలు ఎవరో తెలిస్తే చెప్పండి..!

image

NTR జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం నలుగురు చిన్నారులు వసతి పొందుతున్నారు. గత దసరా ఉత్సవాల సమయంలో తప్పిపోయిన వీరు పోలీసులకు దొరకగా, వారిని CWC ముందు హాజరుపరిచి ఆశ్రయం కల్పించారు. ఫోటోలో ఉన్న ఈ చిన్నారుల తల్లిదండ్రులు లేదా బంధువుల వివరాలు తెలిసిన వారు వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి, ఆధారాలు చూపి పిల్లలను తీసుకెళ్లాలని అధికారులు కోరుతున్నారు.

News February 20, 2026

శనగల కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి: JC

image

జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలంలోని రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనగ కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతులు శనగ పంటను బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలుపై అధికారులు వివరించారు