News April 30, 2024
ఓ జిల్లాలో రాహుల్ ప్రచారం.. పక్క జిల్లాలో పార్టీ వీడిన ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే రామ్‌నివాస్ రావత్ BJPలో చేరారు. అదే సమయంలో రాహుల్ గాంధీ పక్క జిల్లా భిండ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ MP అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, ఇండోర్(MP) అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
Similar News
News December 29, 2024
WTC ఫైనల్‌కు సౌతాఫ్రికా
సౌతాఫ్రికా తొలిసారిగా WTC ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్‌కు వెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి వరకూ అద్భుతంగా పోరాడింది. 56కే 4 వికెట్లు కోల్పోయినా చివర్లో రబాడ (31*), జాన్సెన్ (16*) రాణించడంతో విజయం సాధించింది. రెండో స్థానం కోసం భారత్ (55.89), ఆస్ట్రేలియా (58.89) పోటీ పడుతున్నాయి.
News December 29, 2024
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ సమాధానమిదే
TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటపై పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ స్పందించింది. ‘‘పుష్ప 2’ కోసం 4, 5 తేదీల్లో మైత్రీ మూవీస్ బుక్ చేసుకుంది. మా థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. చాలామంది హీరోలు ఇక్కడికి వచ్చినా ఇలాంటివి జరగలేదు. ఫ్యాన్స్ చొచ్చుకురావడంతోనే తొక్కిసలాట జరిగింది. 45 ఏళ్లుగా మేం థియేటర్‌ను నడిపిస్తున్నాం’ అని నోటీసుల్లో పేర్కొంది.
News December 29, 2024
ఆ రైలు వేగం గంటకు 450 కి.మీ
గంటకు గరిష్ఠంగా 450 KM వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలును చైనా పట్టాలెక్కించింది. CR450 రైలుకు Sun ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇంజిన్ పరీక్షల్లో 400 KM అందుకుంది. గతంలో ప్రవేశపెట్టిన CR400 కంటే 20% ఇంధనాన్ని తక్కువ వినియోగిస్తూ, 12% బరువు తక్కువ ఉండే CR450 బీజింగ్ నుంచి షాంఘైకి (1,214 KM) రెండున్నర గంటల్లో చేరుకోగలదు. ఇది ప్రపంచంలోనే వేగంగా నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుకెక్కనుంది.