News April 30, 2024

చిత్తూరు జిల్లాలో 16,43,593 మంది ఓటర్లు

image

చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 16,43,593 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నగరి, జి.డి.నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీలలో 8,06,070 మంది పురుషులు, 8,34,000 మంది స్త్రీలు మొత్తం 16,43,593 మంది ఓటర్లు ఉన్నారన్నారు.

Similar News

News November 19, 2025

కాణిపాకం అభివృద్ధికి రూ.25 కోట్లు

image

కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు, సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్లను నిర్మించేందుకు రూ.25కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News November 19, 2025

చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

News November 18, 2025

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.