News April 30, 2024
వాకాడు: భర్తకు భోజనం పెట్టి వస్తూ భార్య తిరిగిరాని లోకానికి

వడదెబ్బ సోకి మహిళ మృతి చెందిన సంఘటన వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీ బాలాజీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపు పుట్టమ్మ (52) గ్రామ సమీపంలోని వేరుశనగ తోటలో పనిచేస్తున్న తన భర్తకి భోజనం ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎండ తీవ్రతకు అక్కడే కుప్పకూలిపోయారు. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
Similar News
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో రూ.30కోట్ల వసూళ్లు

నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి సూచించారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పేరుకుపోయిన పన్నుల వసూళ్లపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు రూ.30 కోట్ల పన్నులు వసూలు చేయగా.. మిగిలిన రూ.16 కోట్లు ఈ నెల 15వ తేదీలోగా రాబట్టాలని ఆదేశించారు.
News March 13, 2026
యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.


