News April 30, 2024

మిషన్ ​గగన్​యాన్.. త్వరలో మరో కీలక పరీక్ష

image

గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగం చేపట్టనుంది. త్వరలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా చినూక్ హెలికాప్టర్ సహాయంతో మాడ్యూల్‌ను సుమారు 4-5 కి.మీ ఎత్తున వదులుతారు. దీని ద్వారా పారాచూట్‌‌ల పనితీరును పరీక్షిస్తారు. ఇప్పటికే టీవీ-డీ1 పరీక్ష నిర్వహించగా సక్సెస్ అయింది.

Similar News

News March 10, 2026

AIతో అమ్మాయిల లవ్.. ఆందోళనలో చైనా?

image

చైనాలో యువతులు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ‘AI బాయ్‌ఫ్రెండ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక ఒత్తిళ్లు, పెళ్లి పట్ల విరక్తితో కోట్లాది మంది ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పడిపోతున్న జననాల రేటును మరింత తగ్గిస్తుందని చైనా భావిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తెచ్చింది. చాట్‌బాట్‌ల వాడకంపై టైమ్ లిమిట్, సోషల్ వాల్యూస్ బ్రేక్‌పై నిఘా పెంచింది.

News March 10, 2026

హోటళ్లే కాదు.. హాస్టళ్లలోనూ ఇబ్బందులే!

image

కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది. గ్యాస్ లేక బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే అనేక <<19341968>>హోటళ్లు<<>> మూతపడ్డాయి. ఇదే సెగ హైదరాబాద్‌కు తాకే ప్రమాదం ఉంది. హాస్టళ్లలోనూ వంట నిలిచిపోతే వేలాది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందిపడనున్నారు. బయట హోటళ్లు కూడా క్లోజ్ అయితే తిండి కష్టాలు తప్పవని నెటిజన్లు వాపోతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు.

News March 10, 2026

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు ఎగిసి 78,205కు చేరగా, నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 24,261 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ 30లో మహీంద్రా & మహీంద్రా (+3.67%), ఇండిగో (+3.21%), ఏషియన్ పెయింట్స్ (+3.13%), మారుతీ (+2.94%) టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు కోలుకోవడం, రూపాయి విలువ మళ్లీ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.