News February 12, 2026

సిద్దిపేట: 17న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ

image

కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ నిర్వహణ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 100 మందికి ఐదు రోజుల నివాస శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణ హాల్, పరికరాలు, వసతి, భోజనం తదితర ఏర్పాట్లు సక్రమంగా చేయాలని, మహిళా సభ్యుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. శిక్షణ ఈనెల 17న ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News April 17, 2026

NRPT: నిబంధనల ప్రకారమే లే-అవుట్లకు అనుమతులు: కలెక్టర్‌

image

ప్రభుత్వ నిబంధనలకు లోబడే లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా లే-అవుట్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందిన నాలుగు దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న రెండింటికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

తిరుపతి: ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు ఊరట

image

స్విమ్స్ శ్రీపద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2020-21 ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు 5 ఏళ్లకు బదులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. కోర్సు వ్యవధి మేరకే ఫీజులు ఉండాలన్న విద్యార్థుల విజ్ఞప్తిపై టీటీడీ ఈవో రవిచంద్ర స్పందించి, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదం పొందనుంది. ఈ విధానం ఇకపై తదుపరి బ్యాచ్‌లకు కూడా వర్తించనుంది.

News April 17, 2026

LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

image

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.