News February 12, 2026
పోలింగ్ ముగిసింది.. అయినా జాగ్రత్త: నిర్మల్ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఎస్పీ జానకి షర్మిల గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) మిగిలి ఉన్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు గెలుపు సంబరాలు, ర్యాలీల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 18, 2026
బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీలు

బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఉమా మహేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐగా పని చేస్తున్న తిరుపతిరావును చెరుకుపల్లికి, జిల్లా వీఆర్‌లో ఉన్న కిరణ్ బాబును నిజాంపట్నానికి, బాపట్ల పీసీఆర్ ఎస్సైగా పనిచేస్తున్న బాబురావును మార్టూరు పోలీస్ స్టేషన్‌కు, చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్‌ను జిల్లా వీఆర్‌కు బదిలీ చేశారు.
News April 18, 2026
చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.
News April 18, 2026
GNT: జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆప్టోమెట్రిస్ట్, DDM/MIS, NHM, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, టీబీ హెల్త్ విజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వివరాలకు www.guntur.nic.in సైట్‌ను సందర్శించాలన్నారు.


