News February 12, 2026
సిద్దిపేట: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్

ఈనెల 13న సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద (163 BNSS) సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపు ఉండొద్దన్నారు. బాణసంచా కాల్చడం, విజయ యాత్రలకు అనుమతి లేదన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని సహకరించాలని కోరారు.
Similar News
News April 16, 2026
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: కలెక్టర్ నాగరాణి

భీమవరం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ‘మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యాబోధన అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News April 16, 2026
కోటబొమ్మాళి: యాక్సిడెంట్‌లో 38 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్

కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారి పాకివలస సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. బైక్‌పై కూరగాయలను అమ్ముకొని తిరిగొస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు పొన్నాడ పేటకు చెందిన మురళి (38)గా గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
News April 16, 2026
GNT: బీటెక్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి నెలలో జరిగిన బీటెక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం తెలిపారు. బీటెక్ 1/4, 2/4 రెండో సెమిస్టర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్, ఫీజు చెల్లింపు, తదితర పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.


