News February 12, 2026

ఇవాళ బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ఆ పార్టీకే అవకాశాలు!

image

బంగ్లాదేశ్‌లో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్ కావడంతో ఇండియాతోపాటు ఇతర దేశాల దృష్టి బంగ్లాపై ఉంది. మొత్తం 350 సీట్లు ఉండగా 300 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో 50 స్థానాలు మహిళలు కేటాయించగా వీటి ఎంపిక పరోక్షంగా జరగనుంది. ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP), జమాతే ఇస్లామీ మధ్య ఉన్నా BNPకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

Similar News

News April 18, 2026

భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

image

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

News April 18, 2026

2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

image

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.

News April 18, 2026

నేడు 2 మ్యాచులు.. SRHపై ధోనీ ఆడతారా?

image

IPLలో ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. 3.30PMకు ఢిల్లీ, బెంగళూరు తలపడనున్నాయి. ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచి RCB జోరు మీద ఉండగా, చివరి 2 మ్యాచుల్లో ఓడి DC కష్టాల్లో ఉంది. మరోవైపు 7.30PMకు SRH, CSK మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరుజట్లూ చెరో 2 గెలిచి, 3 ఓడాయి. అయితే వరుసగా 2 మ్యాచుల్లో గెలవడం, ధోనీ ఆడే అవకాశం ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మరోవైపు SRH బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో తేలిపోతోంది.