News February 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News April 16, 2026

క్యాన్సర్‌‌తో పోరాడుతూనే 96.6% మార్కులు!

image

ప్రాణాంతక లింఫోబ్లాస్టిక్ లింఫోమా క్యాన్సర్‌తో పోరాడుతూనే చదువులోనూ సత్తా చాటాడు ఢిల్లీకి చెందిన ఆరవ్ వాట్స్. CBSE టెన్త్ ఫలితాల్లో ఏకంగా 96.6% మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తీవ్రమైన అనారోగ్యం, కఠినమైన చికిత్సలు తన సంకల్పాన్ని అడ్డుకోలేవని నిరూపించిన ఆరవ్.. నిజమైన యోధుడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చావును జయించి, చదువులోనూ రాణించిన అతని ధైర్యం మనందరికీ ఒక గొప్ప పాఠం.

News April 16, 2026

జగన్.. ఇదేం రాక్షస మనస్తత్వం: లోకేశ్

image

AP: YCP చీఫ్ జగన్‌పై మంత్రి లోకేశ్ X వేదికగా విరుచుకుపడ్డారు. ‘తల్లిని, చెల్లిని తరిమేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రప్పా.. రప్పా నరుకుతాం. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తాం అంటారు. ఎందుకీ దుర్మార్గం? అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా. ఇదేం రాక్షసమనస్తత్వం? వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే’ అని దుయ్యబట్టారు.

News April 16, 2026

చడ్ఢాకు ‘Z’ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

image

ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢాకు కేంద్రం ‘Z’ కేటగిరీ భద్రతను కల్పించింది. పంజాబ్ ఎంపీగా ఉన్న ఆయనకు ప్రాణాపాయ ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ ప్రభుత్వం ఆయనకు ఉన్న Z+ భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే కేంద్రం రంగంలోకి దిగడం గమనార్హం. తాజా ఉత్తర్వుల ప్రకారం చడ్ఢాకు ఇకపై 22 మంది CRPF కమాండోలతో కట్టుదిట్టమైన రక్షణ ఉండనుంది.