News April 30, 2024

ఓయూ సెలవులు రద్దు: రిజిస్ట్రార్

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్ మరమ్మతులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గడపాలనే ఉద్దేశంతో ప్రతియేటా వేసవి సెలవులు ఇస్తామని గుర్తు చేశారు. ఈ వేసవి సెలవులు కూడా ఆ నేపథ్యంలోనే ప్రకటించామని అన్నారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత!

image

RR జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత కార్యక్రమం జరిగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దంపతులు CARA పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి 3.5 ఏళ్ల తర్వాత పిల్లలను దత్తత తీసుకున్నారు. గత నెల రోజులుగా ఫాస్టర్ కేర్ కింద పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండగా అనుబంధం సరిగ్గా ఉండడంతో కలెక్టర్ వద్ద ఫైనల్ దత్తత పత్రాలు అందుకున్నారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు.

News March 16, 2026

రంగారెడ్డిలో రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు RR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని SC కార్పొరేషన్ ED పద్మావతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT

News March 14, 2026

పది పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు: రంగారెడ్డి DEO

image

పదోతరగతి పరీక్షలకు ఉదయం 9:35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు అన్నారు. ప్రతి సెంటర్‌ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు.