News February 12, 2026

పార్వతీపురం: ‘జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చేయడమే లక్ష్యం’

image

వ్యవసాయ రంగంలో రూపురేఖలు మార్చేయడమే డిస్ట్రిక్ట్ అగ్రి-రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాన్ లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. DARTP మన జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 24 జిల్లాలు అభ్యర్థనలు సమర్పించగా, ఏపీ నుంచి కేవలం 7 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఇందులో భాగంగా ఈ జిల్లా ఎంపికైందని గుర్తు చేశారు.

Similar News

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

రేపు యథావిధిగా ‘మీకోసం’: కలెక్టర్‌

image

అమలాపురంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు.