News April 30, 2024

సిద్దిపేట: ‘అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు’

image

సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.

Similar News

News March 17, 2026

మెదక్: మెజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న రెండు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్(సెకండ్ క్లాస్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి నీలిమ తెలిపారు. రిటైర్డ్ లేదా రాజీనామా చేసిన జ్యుడీషియల్ అధికారులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కోర్టు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 17, 2026

మెదక్: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాఠశాలలో అటెండర్‌గా పనిచేసిన సారా జైపాల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

News March 17, 2026

RMPT: ఖేలో ఇండియా ఉషు లీగ్‌లో గోల్డ్ మెడల్

image

నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో రామాయంపేటకు చెందిన జమాల్‌పూర్ హీనా మాధురి గోల్డ్ మెడల్ సాధించింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం ప్రతినిధులు, కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు. తన ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులు సుశీల-మల్లేశంకు మాధురి కృతజ్ఞతలు తెలిపారు.