News February 12, 2026

డిప్యూటీ సీఎంకు కోనసీమ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

image

కోనసీమలో రోడ్ల అభివృద్ధికి రూ.65.15 కోట్ల నిధులు కేటాయించినందుకు గాను ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, ఆనందరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో నాలుగు నియోజకవర్గాల్లో 40 ప్రధాన రోడ్లను నిర్మించనున్నారు. ముఖ్యంగా వాడపల్లి కరకట్ట రోడ్డుకు రూ.6 కోట్లు మంజూరు చేయడంపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 18, 2026

రాముని బండ.. తెలంగాణలో మూడవ భద్రాద్రి!

image

జగదేవ్‌పూర్ మండలం జంగంరెడ్డిపల్లి సమీపాన కొలువైన ‘రాముని బండ’ శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రం మహిమాన్విత పుణ్యస్థలిగా వెలుగొందుతోంది. భద్రాచలం, జీడికల్లు తర్వాత శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన మూడవ క్షేత్రం ఇదే కావడం విశేషం. పూర్వం సీతమ్మ దాహం తీర్చేందుకు రాముడు బాణంతో ఉద్భవింపజేసిన ఇక్కడి ‘రామగుండం’లోని నీరు ఎన్నటికీ ఎండిపోదు. ఇక్కడ స్నానం చేస్తే పిల్లల్లో శారీరక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మకం.

News April 18, 2026

బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్.. మోడల్ ఏమన్నారంటే?

image

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా ఫొటోను <<19671107>>లైక్<<>> చేసి తర్వాత అన్‌లైక్ చేయడంపై జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ స్పందించారు. ‘విరాట్ నా ఫొటోకి లైక్ చేసినప్పుడు ఎంతో సంతోషించా. దానివల్ల SMలో ఇంతగా వైరల్ అవుతానని అనుకోలేదు. ఆ ఫొటోకు లైక్ చేయడంలో ఆయనకు దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది చూసి ఆయనపై కాస్త జాలి కలిగింది. కోహ్లీ నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

News April 18, 2026

విశాఖలో ఐటీ, డేటా సెంటర్లకు భూముల కేటాయింపు

image

మధురవాడ, కాపులుప్పాడల్లో కో-వర్కింగ్ పార్క్ కోసం Isprout బిజినెస్ సెంటర్‌కు 9.5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.626.9 కోట్ల పెట్టుబడితో 12,500 మందికి ఉపాధి కల్పించనున్నారు. ప్యూజి సాప్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు ఐటీ క్యాంపస్ కోసం 2 ఎకరాలు కేటాయించారు. రూ.425 కోట్లతో 2,500 ఉద్యోగాలు సృష్టించనున్నారు. అదానీ ఇన్‌ఫ్రా డేటా సెంటర్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.