News February 12, 2026

సంగాం సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత(2/2)

image

ఈ 5 ప్రాంతాలలో 5 లింగాలను ఏకకాలంలో బలరాముడు ప్రతిష్టించి పూజలు నిర్వహించి బ్రహ్మహత్య మహాపాతకమును తొలగించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు కలిసే సంగమేశ్వర స్వామి ఆలయం అతి విశిష్టమైనది. గంగా, యమునా, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం పేరుగాంచిన అలహాబాద్ తర్వాత సంగాం పేరుగాంచింది. మహాశివరాత్రికి వేలాది భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు.

Similar News

News April 16, 2026

రాంగ్ రూట్‌లో వస్తే వాహనాలను సీజ్ చేయాలి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

News April 16, 2026

TG DEECET దరఖాస్తుల సవరణకు అవకాశం

image

TG DEECET-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.

News April 16, 2026

సిరిసిల్ల: మొర్రి పండ్ల అమ్మకంతో గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి

image

అడవులే ఆధారంగా జీవించే గిరిజనులు మెుర్రి పండ్లతో ఉపాధి పొందుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే మొర్రి పండ్లు, ఇప్ప పూల సేకరణకు ఉదయమే అడవి బాటపడతారు. జిల్లాలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు తండాల చెందిన గిరిజనులు మోర్రి పండ్లను అమ్మడం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతున్నారు. ఒక్కో చిన్న గ్లాసు మొర్రి పండ్లు రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.