News February 12, 2026
ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.
Similar News
News April 20, 2026
బెట్టింగ్.. ప్రకాశం జిల్లా యువకుడి అరెస్ట్

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు <<19692230>>బెట్టింగ్ ముఠా<<>>ను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన నరసింహాచార్యులును విచారించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అడ్డగా బెట్టింగ్ నడుపుతున్నట్లు తేలింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు(M) ఉల్లగల్లుకు చెందిన పర్వతనేని వేణుతో పాటు ఇతర జిల్లాలకు చెందిన గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల తాండవ కృష్ణను అరెస్ట్ చేశారు.
News April 20, 2026
మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు.. జాగ్రత్త: SP

ప్రకాశం జిల్లా SP మైనర్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తెలియక వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని SP సూచించారు.
News April 20, 2026
ప్రకాశం: పరిష్కార వేదిక సమయంలో మార్పులు

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.


