News February 12, 2026

ఉమ్మడి నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు అభ్యర్థుల్లో గెలుపు, ఓటముల టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎవరికి ఓటు వేశారు?, ఎవరికి పట్టం కడతారోనని అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఎవరికివారు అంతర్మథనంలోకి వెళ్లి లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరి ధీమాలో వారు ఉన్నారు. చూద్దాం ఈ నెల 13న ఎవరి భవితవ్యం ఎలా ఉందో!

Similar News

News April 16, 2026

టీయూ పాలక మండలిలో కామారెడ్డి జిల్లాకు చోటు

image

రాష్ట్ర ప్రభుత్వం గురువారం టీయూ పాలకమండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఘాజీని పాలకమండలి సభ్యునిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ షబ్బీర్ అలీ వద్ద పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాజిక సేవా రంగం(జర్నలిజం) విభాగంలో ఆయన్ను సభ్యునిగా నియమించారు. ఆయన నియామకం పట్ల షబ్బీర్ అలీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News April 16, 2026

ఢిల్లీలో ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ప్రజా ప్రతినిధుల సందడి

image

ఢిల్లీలో ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు గురువారం సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, MLAలు జగదీశ్వరి, నాగమాధవి, ఎమ్మెల్సీ గ్రీష్మ, తదితరులు పాల్గొన్నారు.

News April 16, 2026

GNT: కోర్టులో దురుసు ప్రవర్తన.. యువతికి ఫైన్

image

గుంటూరు హత్య కేసు ట్రయల్‌లో సాక్షిగా హాజరైన పావని కోర్టులో స్టేట్‌మెంట్ ఇవ్వకుండా బిగ్గరగా కేకలు వేస్తూ జడ్జి, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రొసీడింగ్స్‌కు అంతరాయం కలిగించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి రూ. 200 ఫైన్ విధించారు. చెల్లించకపోతే 15 రోజుల సాధారణ శిక్ష అనుభవించాలని ఆదేశించారు.