News February 12, 2026
T20 WC: నేటి మ్యాచులు

టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి.
✮ ఫస్ట్ మ్యాచ్: శ్రీలంకvsఒమన్(11am)
✮ సెకండ్ మ్యాచ్: నేపాల్vsఇటలీ(3pm)
✮ మూడో మ్యాచ్: ఇండియాvsనమీబియా(7pm)
✮ ఈ మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో Live చూడవచ్చు.
Similar News
News April 16, 2026
VZM: ‘జూన్ 15 నాటికి పాస్ పుస్తకాల్లో తప్పులు సరిదిద్దాలి’

రీసర్వే పూర్తయిన, జరుగుతున్న గ్రామాల్లో మ్యుటేషన్స్, సబ్‌డివిజన్లు పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులతో VC ద్వారా సమీక్ష జరిపారు. 423 గ్రామాల్లో పాస్ పుస్తకాల్లో తప్పులను సరిదిద్దుతూ మే 31లోగా ఫారాలు పూర్తి చేసి జూన్ 15 నాటికి పరిష్కరించాలని సూచించారు.
News April 16, 2026
భర్త శ్రమ, భార్య ప్రతిభ.. ఇంటర్‌లో 991 మార్కులు

AP: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. కర్నూల్(D) ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.
News April 16, 2026
INDలో పెరుగుతున్న ‘స్లీప్ షేమింగ్’.. ఏంటిది?

తక్కువ నిద్రపోవడాన్ని గొప్పగా, ఎక్కువ పోతే సోమరితనంగా భావించే అలవాటు భారతీయుల్లో పెరిగిపోతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీన్నే ‘స్లీప్ షేమింగ్’ అంటారు. కష్టపడి పనిచేయడం అంటే నిద్రను త్యాగం చేయడమేనన్న తప్పుడు ఆలోచన వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అయితే సరిగ్గా నిద్రపోతేనే ఆరోగ్యం, పనిలో వేగం పెరుగుతాయని సూచిస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమంటున్నారు.


