News February 12, 2026

రష్యాలో వాట్సాప్‌ బ్లాక్!

image

వాట్సాప్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోందని మెటా కంపెనీ ఆరోపించింది. వారి ఇంటర్నెట్ స్పేస్‌లో కంట్రోల్ కోసం సొంత యాప్స్‌ను ప్రమోట్ చేస్తోందని మండిపడింది. వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు తాము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నామని తెలిపింది. కాగా తమ ఇంటర్నెట్ సిస్టమ్స్‌లో వాట్సాప్ డొమైన్స్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. MAX యాప్‌ను ఉపయోగించాలని తమ పౌరులను కోరుతోంది.

Similar News

News April 17, 2026

అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటో వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

image

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు <<19671551>>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, AI టెక్నాలజీతో తన వాయిస్‌ని క్లోనింగ్ చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటివి తన బ్రాండ్ విలువను, ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన కోర్టును ఆశ్రయించగా ఇలా స్పందించింది.

News April 17, 2026

LRS దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి: మంత్రి

image

AP: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు దాఖలైన LRS దరఖాస్తులలో అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్‌పై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేశ్‌, ఇతర అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వాటిని క్లియర్ చేయాలని సూచించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన దరఖాస్తు గడువు ఈనెల 23తో ముగియనుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News April 17, 2026

ఆగిన బంగారం ఇంపోర్ట్స్.. పెరగనున్న ధరలు?

image

కేంద్ర ప్రభుత్వం (DGFT) నుంచి అనుమతులు రాకపోవడంతో భారత బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులు నిలిచిపోయాయని రాయిటర్స్ పేర్కొంది. దీంతో టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఆర్డర్లు ఆగిపోయాయి. ఏటా ఏప్రిల్‌ ఆరంభంలోనే ఇచ్చే అనుమతి ఆలస్యం కావడంతో విదేశీ ఆర్డర్లకు బ్రేక్ పడింది. దీనివల్ల దేశీయంగా సరఫరా తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.