News February 12, 2026

పోలవరం జిల్లాలో 29 PHCలకు నిధులు విడుదల

image

పోలవరం జిల్లాలో ఉన్న 29 PHCలకు ఒక్కో ఆసుపత్రికి రూ.2లక్షలు చొప్పున రూ.58 లక్షల నిధులను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి డా. సరిత తెలిపారు. ఈనెల 8న నిధులు వచ్చాయన్నారు. 15 లోపు ఆసుపత్రి నిధులు ఖర్చులు ట్రెజరీకి చూపి నిధులు వినియోగించాల్సి ఉందన్నారు. వాటికి మార్గదర్శకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 17, 2026

అధిక మాసంలో శుభ కార్యాలు ఎందుకు నిషిద్ధం?

image

అధిక మాసంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడు. అందుకే దీనిని ‘శూన్య మాసం’ అంటారు. ‘మైల మాసం’ అని కూడా పిలుస్తారు. శాస్త్రం ప్రకారం.. సూర్య గమనం లేని ఈ సమయంలో చైతన్యం తక్కువగా ఉంటుంది. ఫలితంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేస్తే విఘ్నాలు ఎదురవుతాయని నమ్ముతారు. ఆశించిన ఫలితాలు దక్కవని పండితుల అభిప్రాయం. అందుకే ఈ మాసంలో లౌకిక శుభకార్యాలు పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.

News February 17, 2026

బాపట్ల మహిళలకు రూ.762 కోట్ల బ్యాంకు రుణాలు

image

డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి రూ.762 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అధికారులకు సూచించారు. ప్రస్తుతం రూ.147 కోట్లు మాత్రమే మహిళలకు పంపిణీ చేయడంపై ఆరా తీశారు. శ్రీనిధి రుణాలు లక్ష్యాలను చేరుకోక పోవడంపై ప్రశ్నించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

News February 17, 2026

తూ.గో: ఏకంగా పోలీసులపైనే దాడి.. చివరికి..!

image

కోరుకొండలో పోలీస్ సిబ్బందిపై గుంపుగా దాడి చేసిన ఘటనలో నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.