News February 12, 2026
ఖమ్మం: తాను చనిపోతూ.. ఐదుగురిని బతికించాడు

మధిరకు చెందిన బీటెక్ విద్యార్థి కందిమళ్ల విజయకుమార్ ఇటీవల తాడేపల్లి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. తీవ్ర విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు సాహసోపేత నిర్ణయం తీసుకుని అవయవదానానికి సమ్మతించారు. ఆయన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, కార్నియా దానం చేయడంతో ఐదుగురికి ప్రాణదానం లభించింది. విద్యార్థి కుటుంబం చూపిన ఔదార్యాన్ని వైద్యులు, స్థానికులు కొనియాడారు.
Similar News
News April 18, 2026
ANU: ఫిజికల్ ఎడ్యుకేషన్ 1వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి నెలలో జరిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. BPEdలో 90.48%, DPEdలో 92.86%, MPEdలో 94.50% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ ఫీజు, చివరి తేదీ, వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.
News April 18, 2026
పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు ఇవే…

☞ ఏప్రిల్ 28న: ధ్వజారోహణం, శేష వాహ సేవ ☞29న: బంగారు హనుమంత సేవ ☞ 30న: బంగారు గరుడసేవ ☞మే 1న: కళ్యాణోత్సవం, రథోత్సవం ☞2న: వసంతోత్సవం, అశ్వవాహన సేవ ☞3న: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ.
News April 18, 2026
‘అల్లూరి జిల్లాలో పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తాం’

ఉమ్మడి అల్లూరి జిల్లాలో అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి జరుగుతుందని సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు అన్నారు. రంపచోడవరంలో విద్యాశాఖ అధికారులతో శనివారం సమావేశం జరిగింది. జిల్లాలో ఏ పాఠశాలలకు భవనాలు, మరుగుదొడ్లు, నీరు తదితర సదుపాయాలు అవసరమో నివేదిక అందజేయాలని MEOలను ఆయన ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య, ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు పాల్గొన్నారు.


