News April 30, 2024

బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 4 రోజులు జాగ్రత్త

image

AP: రాష్ట్రంలో ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ జి.సింగవరం(కర్నూలుD)లో 46.4, గోస్పాడు(నంద్యాలD)లో 46.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే నాలుగు రోజులు 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. రేపు 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, 216 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ ప్రాంతాల వివరాలను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.

Similar News

News March 15, 2026

యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

image

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

News March 15, 2026

మ్యాజిక్ జరిగింది: ‘ఉస్తాద్’ ట్రైలర్‌పై మెగాస్టార్

image

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ <<19383616>>ట్రైలర్‌<<>>పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’తో అన్నీ శుభాలే’’ అని Xలో పోస్ట్ చేశారు. పవన్, డైరెక్టర్ హరీశ్ శంకర్ సహా సినిమా యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. DSP సంగీతం అందించారు. ఈనెల 19న సినిమా రిలీజ్ కానుంది.

News March 15, 2026

ChatGPTని దాటేసిన ఇండియన్ ఆయిల్

image

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది ఇండియన్ ఆయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ChatGPTని దాటేసి ఇండియన్ ఆయిల్ యాప్ నంబర్-1గా నిలిచింది. ఆ యాప్‌లో ఎల్పీజీ కనెక్షన్స్, సిలిండర్ బుకింగ్, ట్రాకింగ్, డిస్ట్రిబ్యూటర్ మార్పు, మెకానిక్ సర్వీసులు లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.