News February 12, 2026
MLG: బాధితులకు జగదీశ్ రెడ్డి భరోసా.. దాడిపై ఆగ్రహం!

మిర్యాలగూడలో కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Similar News
News April 16, 2026
అందరి చూపూ పార్లమెంట్ సమావేశాలపైనే..

ఎన్నడూ లేనంతగా యావత్ దేశం పార్లమెంట్ సమావేశాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడమే అందుకు కారణం. మహిళా బిల్లుకు అందరూ ఓకే అంటున్నా డీలిమిటేషన్‌ను మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాసేపట్లో కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును LSలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరగనుంది. సాయంత్రం PM మోదీ ప్రసంగిస్తారు.
News April 16, 2026
రాజంపేట మండలంలో దారుణ హత్య

రాజంపేట మండలం పులపుత్తూరులో గత రాత్రి దంపెట్ల మల్లిఖార్జున (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తల వెనుక బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వారు బండరాయితో దాడి చేయడంతో తల వెనుక బలమైన గాయం తగిలి గ్రామం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 16, 2026
జగిత్యాలలో కేసీఆర్ సభ తర్వాత కాంగ్రెస్ సభకు ప్లాన్..?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈనెల 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే, జగిత్యాలలో కేసీఆర్ సభ ఏర్పాటు జరుగుతుండగా, బీఆర్ఎస్‌లో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉరకలెత్తుతుంది. ఇటీవల సీఎంను జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిసిన సందర్భంలో త్వరలోనే జగిత్యాలకు వస్తానని సీఎం పేర్కొనడం బీఆర్ఎస్ సభ తర్వాత కాంగ్రెస్ సభకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.


