News February 12, 2026

నిర్మల్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ‘తడిసి మోపెడు’

image

నిర్మల్ జిల్లాలోని 80 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భారంగా మారింది. గెలుపు కోసం ఫ్లెక్సీలు, ప్రచారం, మద్యం పంపిణీతో పాటు ఓటుకు నోటు ఇవ్వడంతో ఖర్చు భారీగా పెరిగింది. అధికారులకు చూపే లెక్కలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు చేసిన వాస్తవ వ్యయం మరోలా ఉండటం గమనార్హం. ఎలాగైనా కౌన్సిలర్‌గా గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థులు తమ శక్తికి మించి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News April 7, 2026

మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

జనగామ మాతా, శిశు ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం కాకుండా చూడాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్.. వారికి నాణ్యమైన మందులు, పోషకాహారం అందించాలని వైద్యులను కోరారు.

News April 7, 2026

ఏలూరు: అనాథ చిన్నారులకు.. నూతన జీవితం

image

అనాథలైన ముగ్గురు పిల్లలకు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి నూతన జీవితాన్ని అందించారు. కుక్కునూరుకు చెందిన ముగ్గురు పిల్లల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి వారిని వదిలేసి వెళ్లడంతో చిన్నారులు అనాథలయ్యారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న కలెక్టర్ బాల సంరక్షణ అధికారుల ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం ఆమె ఆ చిన్నారులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.

News April 7, 2026

అమలాపురం: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

అమలాపురం మండలం బండారులంకలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరగిరిపట్నంకు చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం డిపోకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనంపై అంబాజీపేట వైపు వెళ్తున్న యువకుడిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.