News February 12, 2026
SRPT: మున్సిపల్ ఎన్నికలు అప్పుడలా.. ఇప్పుడిలా..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2020లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి 2.47% పోలింగ్ తగ్గింది. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో మొత్తం 2,11,191 ఓటర్లు ఉండగా నిన్నటి ఎన్నికల్లో 1,75,759 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 81.38 % పోలింగ్ నమోదైంది. 2020లో 83.85 శాతం పోలింగ్ నమోదయింది. ప్రజలు ఓటు వేయడం లైట్ తీసుకుంటున్నారా కామెంట్ చేయండి.
Similar News
News April 20, 2026
NGKL: జిల్లాలో ఇంటర్న్ సిప్ పథకం అమలు ద్వారా ఉద్యోగ అవకాశాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్ సిప్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గోడపత్రిక ఆవిష్కరించారు నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్ సిప్ అవకాశం కల్పించడం ద్వారా వాస్తవ వ్యాపార వాతావరణం లో అనుభవం వివిధ రంగాలలో పరిజ్ఞానం మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News April 20, 2026
ఆసిఫాబాద్: 34 మంది సీఆర్‌టీలకు ఊరట

ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న 34 మంది సీఆర్‌టీలకు 9 నెలలుగా నిలిచిన కంటిన్యూవేషన్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జిల్లాలోని 460 పోస్టుల్లో 426 మందికే ఉత్తర్వులు ఉండటంతో మిగిలిన వారికి వేతనాలు నిలిచిపోయాయి. ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ప్రభుత్వం స్పందించి తాజాగా ఉత్తర్వులు ఇవ్వడంతో బాధిత ఉపాధ్యాయులకు ఆర్థిక ఉపశమనం లభించింది.
News April 20, 2026
కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


