News February 12, 2026

BNGR:మున్సిపల్ ఎన్నికలు అప్పుడు అలా.. ఇప్పుడిలా..!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2026లో 2 శాతం మేర తగ్గింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మొత్తం 1,30,192 ఓటర్లు ఉండగా 1,13,398 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 87.1 శాతం పోలింగ్ నమోదయింది. ఓటింగ్ శాతం తగ్గాడానికి కారణాలు కామెంట్ చేయండి.

Similar News

News February 16, 2026

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోయలేని ‘భారం’..!

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీనేజ్ గర్భధారణలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. పల్నాడు జిల్లా 14.94%తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి మోయకూడని భారాన్ని మోస్తుంది. బాపట్ల 12% పైగా ‘క్రిటికల్’ వర్గంలో నిలిచింది. గుంటూరు జిల్లా 8-10% మధ్య ‘హై’ కేటగిరీలో ఉంది. ఈ 3 జిల్లాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక ఆరోగ్య, అధికారుల జోక్యాలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

News February 16, 2026

టెన్త్‌లో రెండు బోర్డు ఎగ్జామ్స్‌పై CBSE క్లారిటీ

image

పదో తరగతిలో రెండు బోర్డు ఎగ్జామ్‌ల పాలసీపై CBSE స్పష్టతనిచ్చింది. విద్యార్థులందరూ మొదటి బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొంది. మొదటి బోర్డు పరీక్షల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే రెండో బోర్డు పరీక్షలకు అనర్హులని తెలిపింది. ఇంప్రూవ్‌మెంట్, మొదటి బోర్డు పరీక్షల్లో ఫెయిలైన వారి కోసం మాత్రమే సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వివరించింది.

News February 16, 2026

నల్గొండ: బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 6 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.