News February 12, 2026

వర్ధన్నపేట: ఆ మూడు వార్డుల ఓటర్లకు డబ్బే డబ్బు..!

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 3, 8, 11వ వార్డుల్లో అభ్యర్థులు హేమాహేమీలు కావడంతో ఓటర్ల పంట పండింది. ఈ వార్డుల నుంచే ఛైర్మన్‌కి కూడా పోటీ పడుతుండటంతో ఓటుకు రూ.3-5 వేల వరకు వ్యక్తులను బట్టి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మద్యం ఏరులై పారింది. 8వ వార్డులో 100 పైపర్ బాటిల్స్ ఇచ్చారట. ఓటర్లను ఆటోలో తరలిస్తున్న సమయంలో సైతం మరో రూ.500 వరకు ఇచ్చారట. దీంతో ఒక్క ఇంట్లో 10 మంది ఉంటే రూ.లక్ష వరకు ముట్టాయట.

Similar News

News April 19, 2026

జగిత్యాల వేదికగా కేసీఆర్ వ్యూహాత్మక గర్జన

image

జగిత్యాలలో రేపు జరిగే KCR సభ రాజకీయంగా కీలక మలుపులు మలుచుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండబోతున్నట్లు ఈ సభ ద్వారా స్పష్టం చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టడానికి వ్యూహాత్మక అంశాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం విషయంలో CM రేవంతే లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేసి, రాష్ట్ర రాజకీయలను ప్రభావితం చేయాలని KCR ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

News April 19, 2026

చమత్కార కవిత్వ రచనలో దిట్ట ‘గాడేపల్లి’: భూతపురి

image

అవధానాల్లో, ఆశుకవితా ప్రదర్శనల్లో చమత్కార భరితంగా కవిత్వ రచన చేయడంలో దిట్ట గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ‘నెలనెలా సీమ సాహిత్యం’ సదస్సులో ‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. ఆధునిక కాలంలో అవధానాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు.

News April 19, 2026

VKB: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పిన ప్రమాదం

image

కుల్కచర్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ పిచికారీ ప్రదర్శనలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన.. డ్రోన్ పంపిణీని ప్రారంభిస్తుండగా అది అదుపుతప్పి ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.