News February 12, 2026

సూర్యాపేటలో క్యాంపు రాజకీయం షురూ..!

image

మున్సిపల్ ఎన్నికల వేళ సూర్యాపేటలో రాజకీయాలు వేడెక్కాయి. హోరాహోరీ పోరు నడుస్తుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది కౌన్సిలర్ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్‌కు తరలించారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ ‘క్యాంపు’ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ రోజే వీరంతా తిరిగి రానున్నట్లు సమాచారం.

Similar News

News April 17, 2026

బాంబు కాదు: ఉప్పల్ మెట్రో స్టేషన్ చెత్త డబ్బాలో టపాసులు: పోలీసులు

image

ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు బెదిరింపు వార్తలపై పోలీసులు స్పందించారు. చెత్త డబ్బాలో టపాసులు ఉన్నట్లు గమనించిన సిబ్బంది మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై PSకు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్‌ను తనిఖీ చేయగా, అవి వేడుకల్లో వాడే టపాకాయలని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

News April 17, 2026

NTR జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. NTR జిల్లాలో మొత్తం 8,35,515 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,06,803 మంది ఉండగా, మహిళలు 4,28,680 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 32 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News April 17, 2026

TU: ‘పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలి’

image

తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా “బుక్ ఎగ్జిబిషన్ – రీడింగ్ క్లబ్” పేరిట శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి చక్కని వేదిక లైబ్రరీ అన్నారు. ప్రతి ఒక విద్యార్థి తమ పుస్తక పఠనం నిరంతరం చేయాలన్నారు. ప్రిన్సిపల్ డా.సుధాకర్, అధ్యాపకులున్నారు.