News February 12, 2026

భూపాలపల్లి: మొదలు కానున్న క్యాంపు రాజాకీయం..?

image

మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కౌంటింగ్‌పై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. ఓట్లలెక్కింపు ప్రక్రియముగిసిన వెంటనే గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాలన్న యోచనలో ఆయా రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేసేపనిలో నిమగ్నమయ్యారు. గెలిచిన వారివద్ద మొబైల్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈమేరకు క్యాంపులకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్, వాహనాలను సిద్ధంచేస్తున్నారు.

Similar News

News April 19, 2026

GWL: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

image

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నుంచి బటన్ నొక్కి రైతు భరోసా రెండో విడత నిధులు రేపు విడుదల చేస్తారని గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఆదివారం ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులందరూ వారి సమీపంలోని రైతు వేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

News April 19, 2026

ఆహారాన్ని వేగంగా తింటున్నారా?

image

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి తినడానికి టైమ్ దొరకట్లేదు. వేగంగా తినడం వల్ల కడుపు నిండిందనే సిగ్నల్ బ్రెయిన్‌కు వెళ్లడం ఆలస్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినేస్తే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ‘ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయి. ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

విజయ్‌తో విడాకులు.. రూ.250 కోట్లు కోరిన సంగీత?

image

TVK చీఫ్ విజయ్, సంగీత విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి లాయర్ల సమక్షంలో ఇటీవల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కోర్టులో విచారణ జరగనుంది. సెటిల్మెంట్ కింద రూ.250 కోట్లు కావాలని సంగీత కోరగా రూ.35 కోట్లను విజయ్ ప్రతిపాదించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని ఆయన చెప్పినట్లు పేర్కొంటున్నాయి.