News February 12, 2026

విజయవాడలో మిస్టరీ.. పార్కింగ్ చేసిన కారులో శవం..!

image

గుణదల ఏలూరు రోడ్డులోని పవర్ ఆఫీస్ ఎదురుగా పార్కింగ్ చేసి ఉన్న ఓ కారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత మూడు నెలలుగా ఆ కారు అక్కడే నిలిపి ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. కారులో మృతదేహాన్ని గమనించిన జనం గురువారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిలిపి ఉంచిన కారులోకి మృతుడు ఎలా వచ్చాడనేది మిస్టరీగా మారింది.

Similar News

News February 21, 2026

PDPL: గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ

image

పెద్దపల్లి RSETI సంస్థ 2026-27 సంవత్సరానికి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం పలు స్వయం ఉపాధి శిక్షణలను అందించనుంది. మగ్గం వర్క్, జ్యువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీసెస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్, పాపడ్-పికిల్స్ తయారీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని, ఆసక్తిగల వారు 9392221907ను సంప్రదించాలని డైరెక్టర్ రాకేశ్ పరిష తెలిపారు.PDPL:

News February 21, 2026

వేడెక్కిన కశ్మీర్.. ALL TIME RECORD

image

ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీర్ ఇవాళ వేడెక్కెంది. ఏకంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతంలో FEBలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సాధారణం కంటే 11 డిగ్రీలు అధికంగా రికార్డయింది. అక్కడ 1940, 2016లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలను తాకింది. అలాగే ఈ నెలలో మంచుతో కప్పబడే గుల్మార్గ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు కాగా ఇవాళ 11.5 డిగ్రీలకు చేరింది. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News February 21, 2026

పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

image

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్‌లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.