News February 12, 2026
పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.
Similar News
News April 18, 2026
ఏపీ జట్టు కెప్టెన్‌గా ముత్తుకూరు యువకుడు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు జరిగే జాతీయ స్థాయి టీ-10 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా నెల్లూరు జిల్లా ముత్తుకూరు యువకుడు బాపనపాటి ప్రకాశ్ ఎంపికయ్యాడు. కరీముల్లా, సునీల్, వెంకటేశ్, నాగేంద్ర, అఖిల్ తదితరులు జట్టు సభ్యులుగా అసోసియేషన్ ప్రకటించింది. స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 18, 2026
నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.
News April 18, 2026
నెల్లూరు: అధికారుల తప్పుడు లెక్కలు..!

నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్న వైద్యాధికారులు వాటిని లెక్కల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో 486, 2024లో 867, 2025లో 34 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఒక్క కేసే నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నా.. అప్రమత్తత చర్యల్లో వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి.


