News February 12, 2026

మాల్స్‌లో మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు: కేంద్రం

image

ఏవైనా వస్తువుల అమ్మకం సమయంలో షాపింగ్ మాల్స్/రిటైలర్స్ ప్రజల మొబైల్ నంబర్‌ను తప్పక ఇవ్వాలని అడగొద్దని కేంద్రం స్పష్టం చేసింది. తప్పనిసరి చేయకుండా, కస్టమర్ ఇష్టంతో నెంబర్ తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. 2023సం.లోనే దీనిపై పరిశ్రమల శాఖ ఓ అడ్వైజరీ జారీ చేసిందని ఈ అంశంపై ప్రశ్నకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో బదులిచ్చారు. అటు ఇలా నంబర్ల దుర్వినియోగంపై DoTకి ఫిర్యాదులు రాలేదన్నారు.
Share It

Similar News

News April 20, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.

News April 20, 2026

ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

image

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.