News April 30, 2024

మూడేళ్లలో మూడు సార్లు ఎన్నికలు!

image

1996 మేలో జరిగిన ఎన్నికల్లో BJP అతిపెద్ద పార్టీగా అవతరించగా.. వాజ్‌పేయి PMగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే లోక్‌సభలో బలం నిరూపించుకోలేక 13 రోజుల్లో GOVT పడిపోయింది. రెండేళ్లు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1998 ఎన్నికల్లో BJP నేతృత్వంలో NDA సర్కార్ ఏర్పాటైంది. అయితే BSP, AIADMK మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కుప్పకూలింది. 1999 ఎన్నికల్లో NDA సంపూర్ణ మెజార్టీ సాధించింది.

Similar News

News February 4, 2026

ఆత్మవిశ్వాసానికి సంకేతం ‘మణిపూరక చక్రం’

image

బొడ్డు భాగంలో ఉండే ఈ చక్రం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఇది సమతుల్యంగా ఉంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు, మంచి జీర్ణక్రియ కలుగుతాయి. ఇది అస్థిరంగా మారితే అజీర్తి, షుగర్, ఎదుటివారిపై అధికారం చెలాయించే స్వభావం పెరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘రం’ మంత్రాన్ని ధ్యానించాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం, సూర్యరశ్మిలో గడపడం, యోగ, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ చక్రాన్ని మేల్కొల్పవచ్చు.

News February 4, 2026

ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

image

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.

News February 4, 2026

‘నాన్‌వెజ్‌’ విక్రయాలపై హైకోర్టు కీలక సూచనలు

image

TG: మాంసం, నాన్‌వెజ్‌ పదార్థాల విక్రయంపై సర్కారుకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. గుడులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్‌ పదార్థాలను అమ్మకుండా ఓ విధానం రూపొందించాలని సూచించింది. భక్తుల మనోభావాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు తయారు చేయాలంది. మాంసం దుకాణాల ప్రారంభానికి పోలీస్‌ స్టేషన్‌ నుంచి NOC పొందాలనే నిబంధన చేర్చాలని తెలిపింది.