News April 30, 2024

చిక్కుల్లో ఎంపీ అభ్యర్థి.. స్విమ్మింగ్‌పూల్‌లో యువతితో ఉన్న ఫొటోలు వైరల్

image

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి చిక్కుల్లో పడ్డారు. స్విమ్మింగ్ పూల్‌లో ఓ యువతితో ఆయన కలిసి ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై స్పందించిన అక్షయ్.. అవి తన కాలేజీ రోజుల్లోని ఫొటోలని తెలిపారు. పాత ఫొటోలను ఇప్పుడు తెరపైకి తెచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఈయన బదౌన్ స్థానం నుంచి బరిలో నిలిచారు.

Similar News

News March 3, 2026

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.

News March 3, 2026

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.

News March 3, 2026

‘హెడ్’ పోయినా పోరాడుతోంది!

image

సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినా యుద్ధంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్‌కు దీటుగా బదులిస్తూ వాటికి సహకరించిన గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ పని అంతా ఇరాన్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ విభాగంలోని ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) చేస్తోంది. ఇందులో సుమారు 1.50 లక్షల మంది సైన్యం ఉంటుంది. అల్టిమేట్‌గా ఖమేనీ దీనికి హెడ్‌గా ఉండేవారు. IRGC కమాండర్ ఇన్ చీఫ్ కూడా హతమయ్యారు.